పవర్ పోతుందన్న భయం లేదు
నిప్పులు చెరిగిన ఏపీ సీఎం జగన్
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఎందుకో పదే పదే అధికారం పోవడం గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. పలు సర్వే సంస్థలన్నీ గంప గుత్తగా జగన్ రెడ్డి ఓడి పోబోతున్నాడని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఊహించని రీతిలో పవర్ లోకి రానుందని పేర్కొంటున్నాయి. ఈ తరుణంలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను విస్తు పోయేలా చేసింది.
సిద్దం సభ సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. చంద్రబాబు మేని ఫెస్టోకు శకుని చేతిలో పాచికలకు తేడా ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. బాబును, పవన్ ను నమ్మే రోజులు పోయాయని అన్నారు.
గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పారు. తనకు అధికారం అంటే వ్యామోహం లేదననారు జగన్ మోహన్ రెడ్డి. అంతే కాదు పవర్ పోతుందన్న భయం అంతకంటే లేదని స్పష్టం చేశారు సీఎం.