NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ పాల‌న ఆగ‌మాగం

Share it with your family & friends

బ్ర‌ద‌ర్ అనిల్ షాకింగ్ కామెంట్స్

అమ‌రావ‌తి – ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న బావ మ‌రిది, వైఎస్ ష‌ర్మిలా రెడ్డి భ‌ర్త,, ప్ర‌ముఖ పాస్ట‌ర్ బ్ర‌ద‌ర్ అనిల్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆనాడు దివంగ‌త వైఎస్సార్ , చంద్ర‌బాబు నాయుడు పాల‌న‌లో ఎలాంటి ఇబ్బందులు రాలేద‌న్నారు. కానీ జ‌గ‌న్ రెడ్డి హ‌యాంలో తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అమలాపురంలోని ఇందుపల్లిలో పాస్టర్ల సదస్సులో పాల్గొని ప్ర‌సంగించారు బ్ర‌ద‌ర్ అనిల్. రాష్ట్రం అంతకంతకూ అప్పుల పాలవుతోందని ఆవేదన వ్య‌క్తం చేశారు. అంతే కాదు చ‌ట్టాల‌ను మార్చేస్తూ కొత్త అర్థాలు తీసుకు రావ‌డం దారుణ‌మ‌న్నారు. శ‌త్రువ‌లంతా న‌శించి పోవాల‌ని శ‌పించారు బ్ర‌ద‌ర్ అనిల్.

వైఎస్ బిడ్డే కదా అని జగన్ రెడ్డికి అవకాశం ఇస్తే రాష్ట్రంలో క్రైస్తవులు సువార్త సభలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని వాపోయారు. రేపు పుట్టబోయే బిడ్డలపైనా అప్పులు భారం పడే పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అనిల్ పేర్కొన్నారు.