మాజీ డీఎస్పీ ప్రవీణ్ రావుపై కేసు
పంజాగుట్ట పీఎస్ లో ఎస్ఐబీ ఫిర్యాదు
హైదరాబాద్ – గత కేసీఆర్ సర్కార్ లో కీలకమైన పోస్టులో ఉంటూ ఫోన్ ట్యాపింగ్ చేశారన్న తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సస్పెండ్ అయిన మాజీ డీఎస్పీ ప్రవీణ్ రావు. ఆయన వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన వెంటనే ప్రవీణ్ రావుపై వేటు వేసింది సర్కార్. ఎక్కడికీ వెళ్లవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా ఐఎస్బీ అధికారులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మాజీ డీఎస్పీ ప్రవీణ్ రావుపై ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ రావుతో పాటు మరికొంత మంది మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది.
ఎస్ ఐ బీ కార్యాలయంలో కీలక సమాచారం ఉన్న హార్డ్ డిస్కులతో పాటు కంప్యూటర్లను ప్రవీణ్ రావు ధ్వంసం చేశారని అభియోగం మోపింది. ప్రత్యేకంగా 17 సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుని రహస్య సమాచారం సేకరించారని తెలిపింది .
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన వద్ద ఉన్న సమాచారన్ని ఇతర హార్డ్ డిస్కులలోకి మార్చారంటూ ఆరోపించింది. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సాక్ష్యాలు తారుమారు చేసినట్లు గుర్తించారు. ఇదే విషయాన్నిపంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎస్ ఐ బీ అదనపు ఎస్పీ డీ.రమేష్ . ఆయనపై ఐపీసీ 409, 427, 201, 120 కింద కేసు నమోదు చేశారు.