ఏపీని మోసం చేసిన మోదీ
చంద్రబాబు ఓ ఊసరవెల్లి
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఎవరిని ఉద్దరించేందుకని పొత్తులు పెట్టుకున్నారంటూ ప్రశ్నించారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిని ఏకి పారేశారు. ఆయనను చూసి రంగులు మార్చే ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ చెప్పిన మోదీ చివరకు మాట మార్చారని, రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి దాకా ఏపీకి ఎన్ని నిధులు కేటాయించిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
దేశంలో కొలువు తీరిన మోదీ సర్కార్ అన్ని వ్యవస్థలను నాశనం చేసిందన్నారు. కేవలం మతం, కులం పేరుతో రాజకీయాలు చేయడం తప్పా చేసింది ఒక్క మంచి పని కూడా లేదని మండిపడ్డారు వైఎస్ షర్మిల.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డిలకు ఎవరికి ఓటు వేసినా అది భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టేనని హెచ్చరించారు షర్మిల. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై చర్చ జరిగిందన్నారు. రాష్ట్రానికి ఏం చేసిందని మీరు పొత్తులు పెట్టుకున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు వైఎస్ షర్మిల.