వేతన సవరణతో బాధ్యత పెరిగింది
స్పష్టం చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్ – టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సర్కార్ సంస్థలోని ఉద్యోగులకు ఫిట్ మెంట్ ప్రకటించింది. ఈ సందర్బంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. కీలక సమావేశం నిర్వహించారు. వేతన సవరణతో ఆర్టీసీ ఉద్యోగుల బాధ్యత మరింత పెరిగిందన్నారు.
భవిష్యత్ లోనూ రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులకు దిశా నిర్దేశం చేశారు. మిగతా పెండింగ్ సమస్యలను ప్రభుత్వ సహకారంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 21 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగులతో వర్చ్‌వల్‌గా ముఖాముఖి నిర్వహించారు.
గత మూడు నెలలుగా ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ కోసం ఉన్నతాధికారులు కసరత్తు చేశారని, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న పీఆర్సీ కల సాకరమైన ఈ సందర్భం చారిత్రత్మాకమని అభివర్ణించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
ఆర్టీసీ సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం పెద్ద పీట వేస్తోందని చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థను ప్రజల్లోకి తీసుకెళ్లి.. వారికి మెరుగైన, నాణ్యమైన సేవలందించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్పష్టం చేశారు సజ్జనార్.
టీఎస్‌ఆర్టీసీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ.. సిబ్బంది సంక్షేమ విషయంలో యాజమాన్యం ఏమాత్రం రాజీ పడటం లేదన్నారు. రెండున్నర ఏళ్లుగా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని గుర్తు చేశారు. బ్యాంకుల సహకారంతో అక్టోబర్ 2022 నుంచి ఒక్కటో తేదిన జీతాలు అందేలా సంస్థ చర్యలు చేపట్టిందన్నారు.
ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చే పెండింగ్ లో ఉన్న రూ.280 కోట్ల బాండ్ల మొత్తాన్ని ప్రభుత్వ సహకారంతో చెల్లిస్తున్నట్లు చెప్పారు. 90 రోజులుగా 25 కోట్ల మంది మహిళలను క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చారని తెలిపారు.