గులాబీ పార్టీకి మాజీ ఎంపీలు గుడ్ బై
బీజేపీలో భారీగా చేరిన నాయకులు
న్యూఢిల్లీ – పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న తరుణంలో నిన్నటి దాకా అహంకారాన్ని, అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలోని గులాబీ పార్టీకి కోలుకోలేని రీతిలో షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే సీనియర్ నాయకులు పక్క చూస్తున్నారు. రాష్ట్రంలో ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది. దీంతో బీఆర్ఎస్ కు చెందిన నేతలలో కొందరు హస్తం కండువా కప్పుకుంటే మరికొందరు కమలం గూటికి చేరుకుంటున్నారు.
తాజాగా కేసీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చారు మాజీ ఎంపీలు. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.
పార్టీలో చేరిన వారిలో బీఆర్ స్ మాజీ ఎంపీలు గోడెం నగేష్ , సీతారాం నాయకడ్, మాజీ ఎమ్మెలయేలు జలగం వెంకట్ రావు, శానంపూడి సైది రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి గోమాస శ్రీనివాస్ ఉన్నారు. ఈ సందర్బంగా తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాబోయేది బీజేపీ సర్కారేనని స్పష్టం చేశారు. తమకు 400 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.