బీ ఫామ్ అందుకున్న జీవన్ రెడ్డి
అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిన మన్నె జీవన్ రెడ్డికి బీ ఫామ్ అందజేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా జీవన్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుడి తనయుడే ఈ జీవన్ రెడ్డి. ఆయన గతంలో మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి పార్టీలో ఉన్నారు. ఇదే సమయంలో కేటీఆర్ తో సాన్నిహిత్యంగా మెలిగిన జీవన్ రెడ్డికి ఊహించని రీతిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యుడిగా ఛాన్స్ దక్కింది.
రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది బీఆర్ఎస్. దీంతో వెంటనే పార్టీ మారారు జీవన్ రెడ్డి. జిల్లా ప్రజల ప్రయోజనాల కోసం తాను మారినట్లు చెప్పినా కేవలం అధికారం కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇక నిన్నటి దాకా ప్రజా పాలన అందిస్తామని చెబుతూ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా తన సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్లను, పదవులను కట్ట బెట్టడంపై బహుజనులు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.