శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.88 కోట్లు
స్వామి దర్శనం కోసం పోటెత్తిన భక్త జనం
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. ఆపదల నుంచి రక్షిస్తాడని, కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని కోట్లాది మంది భక్త బాంధవుల భావన. ఆ ఏడు కొండల వాడిని దర్శించుకుంటే సకల దోషాలు పోతాయని ప్రతీతి.
గోవిందా గోవిందా, శ్రీనివాసా గోవిందా, ఆపద మొక్కుల వాడా గోవిందా..అనాధ రక్షక గోవిందా అంటూ శ్రీవారిని కీర్తిస్తున్నారు..ముందుకు సాగుతున్నారు భక్తులు. ఇదిలా ఉండగా రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. స్వామిని దర్శించు కునేందుకు పోటీ పడుతున్నారు.
ఎక్కడ చూసినా స్వామి వారే దర్శనం ఇస్తున్నారు. భక్తులకు ఆశీర్వచనం కలుగ చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 76 వేల 213 మంది భక్తులు దర్శించుకున్నారు.
19 వేల 477 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా 3.88 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఇక స్వామి వారి దర్శనం కోసం 12 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేకుండా దర్శనం చేసుకునేందుకు కనీసం 10 గంటలకు పైగా పడుతుందని స్పష్టం చేసింది.