సీతారామా కరుణించవా
దర్శించుకున్న మల్లు రవి
నాగర్ కర్నూల్ జిల్లా – కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ మల్లు రవి నాగర్ కర్నూల్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 17 సీట్లకు గాను కేవలం నాలుగు సీట్లకే అభ్యర్థులను ప్రకటించింది ఏఐసీసీ హైకమాండ్ .
ఇదిలా ఉండగా తనకు టికెట్ దక్కుతుందని, తనకే కావాలంటూ ముందు నుంచీ పట్టు వదలని విక్రమార్కుడిగా ప్రయత్నం చేస్తున్నారు మల్లు రవి. నాగర్ కర్నూలు నియోజకవర్గ పర్యటనలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించారు .
ఈసందర్బంగా చారకొండ మండలంలోని చారిత్రాత్మక శ్రీ సీతా రామాంజనేయ స్వామి వారి దేవాలయాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సాదర స్వాగతం పలికింది. పూజారులు వేదాశీర్వచనం చేశారు.
చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అభివృద్ది చేయిస్తానని హామీ ఇచ్చారు డాక్టర్ మల్లు రవి. స్వామి వారిని దర్శించు కోవడం ఆనందంగా ఉందన్నారు .