ఆర్టీసీ ఉద్యోగులకు కంగ్రాట్స్
స్వీట్లు పంపిణీ చేసిన నేతలు
హైదరాబాద్ – తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. 2017కు సంబంధించిన 21 శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు చేసుకుంటున్నారు. ప్రధానంగా ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద ప్రతి రోజూ బస్సులలో వేలాది మంది ప్రయాణం చేస్తున్నారు.
ఈ సందర్బంగా ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్లు, కండక్టర్లకు స్వీట్లు పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు. మిఠాయిలు పంచుతున్నామని, తమ ప్రభుత్వం ఏర్పాటులో ఆర్టీసీ సంస్థలో పని చేస్తున్న 51 వేల మంది ఉద్యోగులతో పాటు వారి కుటుంబీకులు కూడా ఓట్లు వేసి గెలిపించారని పేర్కొన్నారు.
నష్టాలలో ఉన్న ఆర్టీసీ సంస్థను గట్టెక్కించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నం చేస్తోందన్నారు. ఇదిలా ఉండగా 21 శాతం ఫిట్ మెంట్ ప్రకటించినందుకు ఆర్టీసీ సంస్థ యాజమాన్యం, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ , యూనియన్ నేతలు, సిబ్బంది, ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు.