అభివృద్దే మా నినాదం..లక్ష్యం
స్పష్టం చేసిన పీఎం మోదీ
జమ్మూ కాశ్మీర్ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ సత్తా చాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు మోదీ.
మొత్తం 545 సీట్లకు గాను తమకు కనీసం 400కు పైగా సీట్లు వస్తాయని అన్నారు ప్రధానమంత్రి. దేశంలోని 143 కోట్ల మంది భారతీయులు ఒకటే నమ్ముతున్నారని, సుస్థిరమైన పాలన , సమర్థవంతమైన నాయకత్వం కోరుకుంటున్నారని చెప్పారు.
ఈ రెండూ తమ వల్లనే సాధ్యమవుతున్నాయని , అందుకే తాము కచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం తనకు ఉందని మరోసారి కుండ బద్దలు కొట్టారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ప్రతిపక్షాలతో కూడిన కూటమి ఎన్ని జిమ్మిక్కులు చేసినా చివరకు మిగిలేది వారికి కేవలం 30 సీట్లకు మించి రావని అన్నారు.
అభివృద్ది తమ నినాదమని, అదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అవినీతి రహిత పాలన అందించడమే తమ ముందున్న ధ్యేయమని పేర్కొన్నారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.