ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించ లేదు
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
అమరావతి – కాంగ్రెస్ పార్టీ పరంగా ఇప్పటి వరకు శాసన సభ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసేందుకు అభ్యర్థులను ఖరారు చేయలేదని స్పష్టం చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. మంగళవారం ఆమె ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. అయితే కొందరు తమకు టికెట్ ఖరారైనట్లు ప్రచారం చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇది అవాస్తవమని, పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, శ్రేయోభిలాషులు గమనించాలని కోరారు వైఎస్ షర్మిలా రెడ్డి.
రాష్ట్రంలోని ఆయా నియోజక వర్గాల వారీగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన మాత్రమే జరుగుతుందని. పేర్కొన్నారు . ఎక్కడైనా తమకే సీట్ కేటాయించినట్లు చెప్పుకొని తిరిగే వారిపై పార్టీ తరుపున చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వైఎస్ షర్మిల.
అవసరం అయితే ఈ ఎన్నికల్లో పోటీ నుంచి అనర్హులుగా ప్రకటించాల్సి ఉంటుందని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రాజా కుండ బద్దలు కొట్టారు.