NEWSNATIONAL

హైకోర్టు నిర్ణ‌యం స‌రైన‌దే

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ – భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ప్రొఫెస‌ర్ జీఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్దోషిగా ప్రకటించింది బాంబే హైకోర్టు. గ‌త ప‌ది సంవ‌త్స‌రాలుగా త‌న విలువైన జీవితాన్ని కోల్పోయారు జీఎన్ సాయిబాబా. ఇదిలా ఉండ‌గా కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు అయ్యింది.

ఈ సంద‌ర్భంగా విచార‌ణ‌లో వాడి వేడిగా వాద‌న‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది సుప్రీంకోర్టు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు వీలు కుద‌ర‌ద‌ని స్ప‌ష్టం చేసింది ధ‌ర్మాస‌నం. ఇదిలా ఉడ‌గా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయ‌న్న‌ ఆరోపణలపై చట్ట విరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం 1967 కింద ఒక కేసులో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది.

మార్చి 11న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ దావా దాఖ‌లు చేసింది మహారాష్ట్ర ప్ర‌భుత్వం. కాగా దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను జస్టిస్‌లు బిఆర్ గవాయ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా సహేతుకమైనద అని స్ప‌ష్టం చేసింది.