NEWSANDHRA PRADESH

మోసం చంద్ర‌బాబు నైజం

Share it with your family & friends

మంత్రి కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి

నెల్లూరు జిల్లా – రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడిపై భ‌గ్గుమ‌న్నారు. అవినీతి, అక్ర‌మాల‌కు, మోసాల‌కు , భూ క‌బ్జాల‌కు కేరాఫ్ గా మారారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. క్యాంపు ఆఫీసులో మంత్రి మీడియాతో మాట్లాడారు.

మేదరమెట్లలో నిర్వహించిన‌ సిద్ధం సభకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వ‌చ్చార‌ని అన్నారు.గ్రాఫిక్స్‌కు పేటెంట్‌ చంద్రబాబు నాయుడు అని, జనం లేని పార్టీకి సేనాని పవన్ కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. రూ.2.70 లక్షల కోట్లు ప్రజలకు అందివ్వడం కూడా గ్రాఫిక్సేనా అని ప్ర‌శ్నించారు.

2024 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ సునామీ సృష్టించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు మంత్రి కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి. ఇప్ప‌టి దాకా రాష్ట్రంలో నిర్వ‌హించిన సిద్దం స‌భ‌లు సూప‌ర్ స‌క్సెస్ అయ్యాయ‌ని స్ప‌ష్టం చేశారు. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన క‌లిసినా త‌మ‌కు వ‌చ్చే న‌ష్టం ఏమీ లేద‌న్నారు.

ప్ర‌జ‌లే స్వ‌చ్చందంగా త‌ర‌లి వ‌స్తే డ‌బ్బులు ఇచ్చి తెచ్చామ‌ని త‌ప్పుడు కూత‌లు కూస్తే ఎలా అని కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు , ప‌వ‌న్ క‌ళ్యాణ్ , పురందేశ్వ‌రి ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌లు త‌మ‌ను ఆశీర్వ‌దించేందుకు సిద్దంగా ఉన్నార‌ని పేర్కొన్నారు.