కన్ను తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ
నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను టార్గెట్ చేశారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు సీఎం.
తాను ఇంకా బీఆర్ఎస్ పై ఫోకస్ పెట్టలేదని చెప్పారు. ఒకవేళ కన్ను తెరిస్తే బీఆర్ఎస్ పార్టీ నామ రూపాలు లేకుండా పోతుందని హెచ్చరించారు. ఇక ఆ పార్టీలో మిగిలేది ఆ ఐదుగురు మాత్రమేనని ఎద్దేవా చేశారు. పదే పదే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కేవలం ఆరు నెలలు మాత్రమే ఉంటుందని రాజ్యాంగ విరుద్దమైన మాటలు మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు.
ఇంకోసారి బీఆర్ఎస్, బీజేపీ నేతలు గనుక ఇలాగే మాట్లాడితే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా చెప్పులు వేస్తారంటూ హెచ్చరించారు రేవంత్ రెడ్డి. తాను ఇంకా టార్గెట్ చేయలేదని, ఒక్కసారి గనుక ఫోకస్ పెట్టడం మొదలు పెడితే తట్టుకోలేరంటూ ఫైర్ అయ్యారు.
ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారంటూ ప్రశ్నించారు. జనం బీఆర్ఎస్, బీజేపీలను నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు సీఎం.