ఆర్టీఐ కమిషనర్ గా రెహనా బేగం
ప్రమాణ స్వీకారం చేసిన జర్నలిస్ట్
అమరావతి – ప్రముఖ జర్నలిస్ట్ రెహనా బేగం ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ కమిషనర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెను ప్రత్యేకంగా ఆర్టీఐ కమిషనర్ గా నియమించారు వైసీపీ బాస్, సీఎం జగన్ మోహన్ రెడ్డి . రెహనా బేగంతో పాటు మరో ముగ్గురిని కమిషనర్లుగా నియమించారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర సమాచార కమిషనర్లుగా చావలి సునీల్ , రెహానా బేగం , అల్లారెడ్డి ఉదయ్ భాస్కర్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ముగ్గురితో రాష్ట్ర సమాచార కమిషనర్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమిషన్ ముఖ్య సమాచార కమిషనర్ మహబూబ్ భాషా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సమాచార కమిషనర్లు ఐలాపురం రాజా, శామ్యూల్ జొనాతన్ ,కాకర్ల చెన్నారెడ్డి, సమాచార కమీషన్ లా సెక్రటరీ జి. శ్రీనివాసులు , ప్రభుత్వ సలహాదారు నేమాని భాస్కర్, నూతన సమాచార కమీషనర్ల కుటుంబ సభ్యులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.