వేం నరేందర్ రెడ్డితో అమిత్ రెడ్డి భేటీ
కాంగ్రెస్ లో చేరనున్న చైర్మన్ తనయుడు
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకు బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా అన్న అనుమానం కలుగుతోంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , ఇతర సీనియర్లు పక్క చూపులు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉన్నట్టుండి నల్లగొండ జిల్లాకు చెందిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ తనయుడు అమిత్ రెడ్డి ఉన్నట్టుండి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు.
ఇప్పటికే నల్లగొండలో ఇంకొకరిని పోటీ చేయకుండా ఉండేందుకు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ సీటు కోసం పోటీ పడ్డారు అమిత్ రెడ్డి. అయితే ఆయనకు హామీ ఇవ్వలేదు మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ.
దీంతో ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ సమయంలో అమిత్ రెడ్డి నరేందర్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా రాజకీయాలు మరింత వేడిని కలుగ చేస్తున్నాయి.