NEWSNATIONAL

సీఏఏపై గ‌ళం ఎత్తండి

Share it with your family & friends

ఖ‌ర్గేను క‌లిసిన ఏజేపీ చీఫ్

న్యూఢిల్లీ – న‌రేంద్ర మోదీ సార‌థ్యంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఉమ్మ‌డి పౌర స‌త్వ సవ‌ర‌ణ చ‌ట్టం తీసుకు వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీనిపై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర స్థాయిలో మండి ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ , త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ , క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌లు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. జార్ఖండ్ సీఎం చంపా సోరేన్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉండ‌గా సీఏఏ వ‌ల్ల చాలా ఇబ్బందులు ఏర్ప‌డుతాయ‌ని, దీనిపై గ‌ళం ఎత్తాలంటూ మంగ‌ళ‌వారం అస్సాం జాతీయ ప‌రిష‌త్ (ఏజేపీ) చీఫ్ లూరింజ్యోతి గొగోయ్ సార‌థ్యంలోని బృందం డిమాండ్ చేసింది. ఈమేర‌కు మంగ‌ళ‌వారం న్యూ ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను క‌లుసుకుంది.

అస్సాం ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలను ప్ర‌స్తావిస్తూ ఓ విన‌తి ప‌త్రాన్ని అంద‌జేశారు ఏఐసీసీ చీఫ్ కు. పౌరసత్వ సవరణ చట్టం వివక్షతతో కూడుకుని ఉన్న‌ద‌ని, ఇది పూర్తిగా భారత రాజ్యాంగానికి చెందిన‌ ప్రాథమిక సూత్రాలు , స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని పేర్కొంది.

కేవ‌లం ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందేందుకే బీజేపీ ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని ఆరోపించారు ఏజేపీ చీఫ్ గొగోయ్.