NEWSANDHRA PRADESH

జ‌న‌సేన‌ కూట‌మిదే జెండా

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వన్ క‌ళ్యాణ్ కీలక వ్యాఖ్య‌లు చేశారు. తెలుగుదేశం, భార‌తీయ జ‌న‌తా పార్టీతో కూడిన కూట‌మి ఈసారి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు జ‌న‌సేన చీఫ్‌.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలసి పని చేస్తాయ‌ని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీట్ల పంపకం జరిగింద‌న్నారు. సీట్ల సంఖ్య..హెచ్చు తగ్గుద‌ల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని పేర్కొన్నారు. మూడు పార్టీలు ధృడ సంకల్పంతో ముందడుగు వేశాయ‌ని తెలిపారు.

ఈ కూటమి ఆవిర్భావంతో రాష్ట్ర పురోభివృద్ధికి ఒక బలమైన పునాది పడిందని తాను న‌మ్ముతున్న‌ట్లు తెలిపారు. ఎన్.డి.ఏ. భాగస్వాములుగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ , బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు బైజయంత్ పాండా కు , టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకు ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.