సీఎంను కలిసిన కోకాకోలా సీఈవో
రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు
హైదరాబాద్ – ప్రముఖ పానియాల సంస్థ హిందూస్తాన్ కోకాకోలా బేవర్జీస్ సంస్థ ముఖ్య కార్య నిర్వహణ అధికారి జాన్ పాబ్లో రోడ్రీగెజ్ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సిఈవోతో పాటు కంపెనీ ప్రతినిధులు కూడా ఉన్నారు.
ఈ సందర్బంగా కొత్తుగా కొలువు తీరిన రేవంత్ రెడ్డిని అభినందించారు. సదరు సంస్థ ప్రస్తుతం మెదక్ జిల్లాలో ఏర్పాటైంది. గత సర్కార్ హయాంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని ప్రకటించింది. ఇది పక్కన పెడితే పేరొందిన కంపెనీలు, ప్రతినిధులు వరుస పెట్టి సీఎంను కలుస్తుండడం విశేషం.
ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి సీఈవోకు భరోసా ఇచ్చారు. ఉపాధి కల్పించే దిశగా ఆలోచించే ఔత్సాహికులు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, కంపెనీలు ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
అభివృద్దే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ముందుకు వెళతామని, తమతో కలిసి వచ్చే వారికి తోడ్పాటు ను వంద శాతం అందజేస్తామని స్పష్టం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి.