బీజేపీదే విజయం మోదీనే పీఎం
స్పష్టం చేసిన అమిత్ చంద్ర షా
న్యూఢిల్లీ – భారతీయ జనతా పార్టీ\లో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనుందని చెప్పారు. దేశంలో మోదీ ప్రధాన మంత్రిగా కొలువు తీరిన తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు.
త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఢోకా లేదన్నారు. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల కంటే ఈసారి అదనంగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా. తిరిగి ముచ్చటగా మూడోసారి బీజేపీ పవర్ లోకి వస్తుందని ,మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర దాస్ మోదీ కొలువు తీరడం ఖాయమని జోష్యం చెప్పారు కేంద్ర మంత్రి.
బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై రూ.వేల కోట్లలో అవినీతి ఆరోపణలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. కానీ, మోడీపై ఎలాంటి అవినీతి మరకలు లేవన్నారు.. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల అజెండా ఒక్కటేనంటూ ఎద్దేవా చేశారు అమిత్ చంద్ర షా.