బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్
అమరావతి : బీసీవై పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ సంచలన ప్రకటన చేశారు . రాష్ట్ర కూటమి సర్కార్ దిగి వచ్చేంత వరకు తాను ధర్మ దీక్షను విరమించే ప్రసక్తి లేదన్నారు. హైదరాబాద్‌లో జరిగిన భూదోపిడీ అమరావతిలో పునరావృతం కానివ్వం అన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలోని బీసీ సంఘాలు, నాయకులు, మేధావులు నా న్యాయపరమైన పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. నాకు మద్దతు ప్రకటించిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా విజయసాయి రెడ్డికి నా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం మా ఐదు డిమాండ్లను నెరవేర్చి, దిగివచ్చేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. దీనిపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు రామచంద్ర యాదవ్ .
బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ చేపట్టిన బీసీ ధర్మ దీక్షకు కాపు, తెలగ, బలిజ జేఏసీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని జేఏసీ చైర్మన్ దాసరి రాము తెలిపారు. బడుగు, బలహీన వర్గాలు రాజ్యాధికారం చేపట్టాలనే రామచంద్ర యాదవ్ ఆశయానికి తాము అండగా ఉంటామన్నారు. రాజధాని అమరావతిలో కేవలం కొందరికే కాకుండా, బీసీ, ఎస్సీ, కాపులతో సహా అన్ని పేద వర్గాలకు సమహక్కులు, భాగస్వామ్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.






