మా కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్దార్
నిప్పులు చెరిగిన మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు రాజకీయాలతో ఏం పని అంటూ నిలదీశారు. కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన కార్యకర్తలను ఖాకీలు టార్గెట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడని , తాను తల్చుకుంటే సీఎంగా ఉండడని హెచ్చరించారు కేసీఆర్. తాను తెలంగాణలో గెలిచి ఉంటే యావత్ భారత దేశాన్ని జాగృతం చేసే వాడినంటూ ప్రకటించారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
గులాబీ జెండాను తాకే దమ్ము కలిగిన నాయకుడు ఈ దేశంలో లేడన్నారు. తనతో పెట్టుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ తిరిగి పవర్ లోకి వస్తుందని ప్రకటించారు. త్వరలోనే కాళేశ్వరం గురించి బయటకు అన్ని వివరాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు మాజీ సీఎం.
వరికి బోనస్ ఓ బోగస్ గా మారిందన్నారు. మిషన్ భగీరథను అమలు చేయాలనే స్పృహ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా అని మండిపడ్డారు. కాకమ్మ కబుర్లు చెప్పేందుకే సీఎం ప్రయత్నం చేస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు కేసీఆర్.