జీవో 317పై కీలక నిర్ణయం
మంత్రి దామోదర రాజ నరసింహ
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జీవో 317 నెంబర్ పై ప్రత్యేకంగా సమావేశం జరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీఈ జీవో పై ప్రత్యేకంగా భేటీ కొనసాగింది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి.
ఈ మంత్రివర్గం ఉప సంఘంలో సభ్యులుగా ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, వివిధ శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
క్యాబినెట్ సబ్ కమిటీ 317 జీవో వల్ల ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు సబ్ కమిటీ చైర్మన్ రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ . ఈ సందర్బంగా జీవోలోని లోటుపాట్లను సరిదిద్దేందుకు ఉద్యోగ సంఘాలతో సమావేశం కావాలని నిర్ణయించడం జరిగిందన్నారు.
జీవో నెంబర్ లు 317, 46 ల వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై, పలు అంశాలపై అధ్యయనం చేసి పరిష్కారానికి కృషి చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆన్ లైన్ ద్వారా కూడా అవకాశం కల్పించాలని కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.