తిరిగి ఆ ఇద్దరికే ఛాన్స్
తెలంగాణ కేబినెట్ ఆమోదం
హైదరాబాద్ – ఓ వైపు రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినా ఎమ్మెల్సీల వ్యవహారంపై అయినా మనసు మార్చుకోలేదు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. సీఎంగా కొలువు తీరిన వెంటనే ఎవరితోనూ చర్చించకుండానే ఉన్నట్టుండి ఇద్దరికి ఎమ్మెల్సీలుగా సిఫారసు చేశారు. ఆ మేరకు హుటా హుటిన ఫైల్ ను రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు పంపించారు. ఆమె ఎలాంటి ఆలశ్యం చేయకుండానే వెంటనే సంతకం చేసేసింది. దీనిని సవాల్ చేస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ , సత్యనారాయణలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ ఊహించని రీతిలో తెలంగాణ జన సమితి ప్రెసిడెంట్ కోదండ రామి రెడ్డి, ప్రముఖ పాత్రికేయుడు అమీర్ అలీ ఖాన్ పేర్లను ఖరారు చేసింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలపై పిటిషన్ పై విచారణ చేపట్టింది హైకోర్టు. సంచలన వ్యాఖ్యలు చేస్తూనే గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టింది.
మంత్రి వర్గం ఆమోదించి పంపించిన అభ్యర్థులను తిరస్కరించే అధికారం గవర్నర్ కు లేదని కేవలం ఏమైనా అనుమానాలు లేదా అభ్యంతరాలు ఉంటే తిరిగి ఫైల్ ను వెనక్కి పంపించాలని పేర్కొంది. ఇంతగా చీవాట్లు పెట్టినా రేవంత్ ప్రభుత్వం బేఖాతర్ చేస్తూ ముందుకు వెళ్లింది. తిరిగి మంత్రివర్గం ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను ఖరారు చేస్తూ తీర్మానం చేసింది.