కాంగ్రెస్ కు రాజీనామా అబద్దం
పటేల్ రమేష్ రెడ్డి కామెంట్
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. తనకు పార్టీ పరంగా ఎలాంటి అన్యాయం జరగలేదన్నారు. తనకు మంచి గుర్తింపు ఉందని, ఇందులో ఎలాంటి ఆందోళన చెందడం లేదని స్పష్టం చేశారు పటేల్ రమేష్ రెడ్డి.
తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో తనకు అసెంబ్లీ టికెట్ వస్తుందని ఆశించారు. కానీ ఊహించని రీతిలో కోలుకోలేని షాక్ తగిలింది. పార్టీ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రాలేదు. ఇతర నేతలకు ఛాన్స్ ఇచ్చింది ఏఐసీసీ. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు ఆనాడు. అప్పట్లో వైరల్ గా కూడా మారారు.
ఇది పక్కన పెడితే ఈ సందర్బంగా తప్పనిసరిగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ టికెట్ కచ్చితంగా ఇస్తామంటూ హామీ ఇచ్చారు సీనియర్ నాయకులు. వారిలో ప్రస్తుత మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి కందూరు జానా రెడ్డి. విచిత్రం ఏమిటంటే తాజాగా ప్రకటించిన లిస్టులో పటేల్ రమేష్ రెడ్డి పేరు లేకుండా పోయింది. ఆయనకు బదులు జానా రెడ్డి తనయుడు కందూరు రఘువీర్ రెడ్డికి టికెట్ కన్ ఫర్మ్ చేసింది. దీంతో పార్టీ మారుతారని జోరుగా ప్రచారం సాగింది.
దీనిపై క్లారిటీ ఇచ్చారు రెడ్డి. తాను పార్టీ మారడం లేదని, రేవంత్ రెడ్డి తోనే ఉంటానని స్పష్టం చేశారు.