NEWSANDHRA PRADESH

జనం సిద్ధం మ‌ళ్లీ జ‌గ‌నే సీఎం

Share it with your family & friends

మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి

వ‌డ‌మాల‌పేట – ఏపీ సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని తిరిగి ముఖ్య‌మంత్రిగా చేసేందుకు జ‌నం సిద్దంగా ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి. ఎన్నికల పోరులో ప్రజల ఆశీస్సులే జగనన్న ఆయుధం అన్నారు. సంక్షేమాన్ని అందుకున్న ప్రజలకు.. దానికి అడ్డుపడే పెత్తందార్లకి మధ్యే యుద్దం అని చెప్పారు.

మంచిపై చెడు గెలిచినట్లు ఏ చరిత్రలోను లేదన్నారు ఆర్కే రోజా. బుధవారం మండల కేంద్రం వడమాలపేటలో ఏర్పాటు చేసిన సిద్ధం సభలో ఆమె పాల్గొన్నారు. ఎస్‌బిఆర్‌ పురం పంచాయతీలోని చెంచు వారి కాలనీలో 55 మందికి, ఏబిఆర్‌ కాలనీలో 107 మందికి ఇండ్ల పట్టాలను పంపిణి చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎన్నికల యుద్దం ప్రారంభం కానుందని జగనన్నను మళ్లీ సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో సమస్యలు కనుగొని దానికి అనుగుణంగా నవ రత్నాలను రచించి. ప్రతి రంగానికి, ప్రతి సామాజిక వర్గానికి మేలు జరిగేలా సంక్షేమాన్ని అమలు చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ రెడ్డికి ద‌క్కుతుంద‌న్నారు.

వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసి పాల‌న‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు తీసుకు వ‌చ్చామ‌న్నారు. ఎన్నికలకు మరో 45 రోజులు ఉందన్నారు. స‌ర్కార్ చేసిన సంక్షేమ ప‌థ‌కాల గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని కోరారు. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు చెప్పే మాట‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు.