NEWSTELANGANA

మాజీ డీఎస్పీ ప్ర‌ణీత్ రావు అరెస్ట్

Share it with your family & friends

ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్

హైద‌రాబాద్ – దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది ఫోన్ ట్యాపింగ్ కేసు. స‌స్పెండ్ అయిన డీఎస్పీ ప్ర‌ణీత్ రావును సిరిసిల్ల‌లో అదుపులోకి తీసుకున్నారు పంజాగుట్ట పోలీసులు. ఇదిలా ఉండ‌గా గ‌త మూడు రోజులుగా ఆయ‌న నివాసం వ‌ద్ద రెక్కీ నిర్వ‌హించారు. ఊహించ‌ని రీతిలో చాక చ‌క్యంగా ప్ర‌ణీత్ రావును అదుపులోకి తీసుకున్నారు.

సిరిసిల్ల పట్టణం శ్రీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు మాజీ డీఎస్పీ ప్ర‌ణీత్ రావు. గ‌త కొంత కాలంగా స‌స్పెండ్ అయ్యాక త‌ప్పించుకు తిరుగుతున్నాడు. మాజీ డీఎస్పీని మంగ‌ళ‌వారం రాత్రి 11 గంట‌ల‌కు చాక చ‌క్యంగా లొంగ దీసుకున్నారు.

ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసి ఆధారాలు లేకుండా చేశారన్న ఆరోపణలు ఆయన పై ఉన్నాయి. అంతే కాకుండా ఎస్ఐబీలో ప్రణీత్ రావు కు సహకరించిన అధికారుల పాత్ర పై ఆరా తీస్తున్నార‌ని స‌మాచారం. విచిత్రం ఏమిటంటే గ‌త స‌ర్కార్ లో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ బాగోతాలు బ‌య‌ట ప‌డుతుండ‌డంతో విస్తు పోయేలా చేసింది.

ప్ర‌వీణ్ రావు గురించి ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఓటు కు నోటు కేసులో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు ఫోను ట్యాపింగ్ క్లిప్స్ మీడియా కు లీక్ చేసినట్లు టాక్. నారా లోకేష్ గారి ఫోన్లతో పాటు ముఖ్య అనుచ‌రులైన కిలార్ రాజేష్, అభీష్ట ఫోన్టు కూడా ట్యాపింగ్ చేసిన‌ట్లు స‌మాచారం .

అంతే కాదు గ‌త ప్ర‌భుత్వంలో ఉన్న మాజీ మంత్రి భార్య ఫోను కూడా ట్యాపింగ్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.