మహిళలకు న్యాయం స్నేహ హస్తం
వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ
మహారాష్ట్ర – ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలు లేక పోతే ఈ దేశం లేదన్నారు. సమాజాభివృద్దిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ ఇవాళ మహిళలకు కచ్చితమైన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీని కింద దేశంలోని మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ కొత్త ఎజెండాను ప్రకటించిందని చెప్పారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ పరంగా మహిళా న్యాయ గ్యారెంటీ కింద 5 ప్రకటనలు చేసిందన్నారు. మహాలక్ష్మి హామీ పథకం కింద నిరుపేద కుటుంబం లోని ప్రతి మహిళకు ఏటా రూ. లక్ష సాయం అందజేస్తామని తెలిపారు. సగం జనాభా పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు.
దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ కొత్త జాబ్స్ నియామకాలలో మహిళలకు సగం హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అధికారం పట్ల గౌరవం కూడా ఇస్తామన్నారు. ఈ పథకం కింద అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికుల నెలసరి వేతనానికి కేంద్ర ప్రభుత్వ సహకారం రెట్టింపు అవుతుందన్నారు రాహుల్ గాంధీ.
మహిళలకు గౌరవం పేరుతో పథకాన్ని తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ప్రతి పంచాయతీలో పారా లీగల్ అసిస్టెంట్‌ని నియమిస్తామన్నారు. సావిత్రి బాయి ఫూలే పేరుతో హాస్టల్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో కనీసం ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.