NEWSANDHRA PRADESH

జ‌న‌సేన కూట‌మిదే జ‌యం

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ చీఫ్ , ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇంటికి వెళ్ల‌డం ఖాయ‌మ‌ని అన్నారు. జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ కూట‌మి ఘ‌న విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. బుధ‌వారం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

వ‌చ్చే మే 15 వ‌ర‌కే ఏపీలో జ‌గ‌న్ రెడ్డి ఉంటార‌ని, ఆ త‌ర్వాత గాయ‌బ్ కావ‌డం త‌ప్ప‌ద‌న్నారు. సిద్దం అంటున్న వైసీపీపై తాను యుద్దం ప్ర‌క‌టించాన‌ని చెప్పారు. త‌మ ల‌క్ష్యం రాజ‌కీయ ప్ర‌క్షాళ‌న‌, అధికార మార్పు త‌థ్య‌మ‌న్నారు.

అన్ని పార్టీల‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు త‌మ వైపు చేరేందుకు ఆస‌క్తితో ఎదురు చూస్తున్నార‌ని అన్నారు. ఇందుకు తాజాగా ఉదాహ‌ర‌ణ భీమ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే పుల‌ప‌ర్తి రామాంజ‌నేయులు త‌మ పార్టీలో చేరార‌ని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం చారిత్రక పొత్తుకు అడుగులు వేశామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆరు నూరైనా స‌రే త‌మ కూట‌మి త‌ప్ప‌కుండా గెలుపు సాధించ‌డం త‌ప్ప‌ద‌న్నారు.