ఫ్రీ బస్సు వద్దంటే వారిపై బస్సెక్కిస్తా
స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్
హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. వారి సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. ఇప్పటికే ఎన్నికల సందర్బంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు గాను నాలుగు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు.
ఇదే సమయంలో మహిళలకు ఇబ్బందులు ఉండ కూడదనే ఉద్దేశంతో ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని అన్నారు. కొంత మంది సన్నాసులు కావాలని తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
ఎవరైనా ఉచిత బస్సు పథకం వద్దని అంటే వారి పై నుంచి బస్సును ఎక్కించైనా అమలు చేసి తీరుతామని హెచ్చరించారు ఎనుముల రేవంత్ రెడ్డి. తాము ప్రజల కోసం పని చేస్తున్నామని అన్నారు. నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. 2 లక్షల జాబ్స్ భర్తీ చేస్తామన్నారు. ఆడ బిడ్డలకు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.
రింగ్ రోడ్డు చుట్టూ రైతు బజార్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం. వారు తయారు చేసే ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు .