NEWSNATIONAL

త‌మిళ నాట‌ టాటా మోటార్స్ పెట్టుబ‌డి

Share it with your family & friends

రూ. 79,000 కోట్ల‌తో వాహ‌న త‌యారీ కేంద్రం

త‌మిళ‌నాడు – ప్ర‌ముఖ భార‌తీయ వ్యాపార దిగ్గ‌జం టాటా మోటార్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు భారీ ఎత్తున పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు, దీని ద్వారా అత్య‌ధికంగా జాబ్స్ క‌ల్పించేందుకు అవ‌కాశం క‌లుగుతుంద‌ని పేర్కొంది.

ఇందులో భాగంగా తాము ముందుగా త‌మిళ‌నాడు రాష్ట్రాన్ని ఎంచుకున్నామ‌ని టాటా మోటార్స్ వెల్ల‌డించింది. ప్ర‌త్య‌క్షంగా 5,000 మందికి పైగా ఉద్యోగాలు సృష్టించేందుకు వీలుగా రూ. 79,000 కోట్ల రూపాయ‌ల‌ను ఇన్వెస్ట్ చేయ‌నున్న‌ట్లు పేర్కొంది.

ఈ మేర‌కు త‌మిళ‌నాడులో టాటా మోటార్స్ ఆధ్వ‌ర్యంలో వాహ‌న త‌యారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఇందుకు సంబంధించి త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి తిరు ఎంకే స్టాలిన్ తో చ‌ర్చించింది. రాష్ట్ర స‌ర్కార్ తో ఒక అవ‌గాహ‌న ఒప్పందంపై సంత‌కం చేసింది.

ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సీఎం. రెండో అతి పెద్ద ఆర్థిక రాష్ట్రంగా త‌మిళ‌నాడు ఇప్ప‌టికే పేరు పొందింద‌ని చెప్పారు. 2030 నాటికి ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మారేలా తాము ల‌క్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నామ‌ని పేర్కొన్నారు స్టాలిన్.