ఈసీకి సుప్రీంకోర్టు ఝలక్
15 లోగా నమోదు చేయాలి
న్యూఢిల్లీ – ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి వివరాలను వెంటనే కేంద్ర ఎన్నికల సంఘంలో నమోదు చేయాలని ఆదేశించింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు. తమకు నాలుగు నెలల సమయం కావాలంటూ చిలుక పలుకులు పలికింది. దీనిని గమనించిన కోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏ మాత్రం ఆలశ్యం చేసినా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని హెచ్చరించింది కోర్టు. ఈనెల 12 సాయంత్రం లోగా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి ఎవరెవరు, ఏయే సంస్థలు విరాళాలు ఇచ్చాయో అందజేయాలని ఆదేశించింది. దీనిపై కొంత గడువు కోరడంపై మండిపడింది ధర్మాసనం.
ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు ఉందని స్పష్టం చేసింది కోర్టు . ధిక్కరణ కిందకే వస్తుందని వార్నింగ్ ఇవ్వడంతో దిగి వచ్చింది ఎస్బీఐ. ఈ మేరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమర్పించింది.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఝలక్ ఇచ్చింది. మార్చి 15 లోగా ఈసీకి సంబంధించిన వెబ్ సైట్ లో (పబ్లిక్ డొమైన్ ) నమోదు చేయాలని ఆదేశించింది. ఈ విషయంపై స్పందించారు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్.