షర్మిలపై పూనమ్ కౌర్ ఫైర్
గీతాంజలి ఘటనపై కామెంట్
ముంబై – ప్రముఖ నటి పూనమ్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఆమె ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీ పీసీసీ) చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిని ఏకి పారేశారు. ఒక బాధ్యత కలిగిన రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్న ఆమె ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంటే కనీసం మానవతా దృక్ఫథంతో స్పందించక పోవడం దారుణమని పేర్కొన్నారు పూనమ్ కౌర్.
ఆమె మరణం తనను ఎంతగానో కదిలించి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాటి మహిళలు, పిల్లల పట్ల స్పందించడమే నిజమైన స్త్రీ నాయకత్వమని వ్యాఖ్యానించారు పూనమ్ కౌర్. ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయింది నటి. రోజు రోజుకు చిన్నారులు, బాలికలు, యువతులు, మహిళల పట్ల దారుణాలు పెరుగుతున్నాయని ఆవేదన చెందారు పూనమ్ కౌర్. వీటిని నియంత్రించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ఇదిలా ఉండగా ఆమె రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.