NEWSTELANGANA

మై హోంకు స‌ర్కార్ బిగ్ షాక్

Share it with your family & friends

భూదాన్ భూములు ఖాళీ చేయాలి

హైద‌రాబాద్ – దైవం పేరుతో దోపిడీ చేస్తూ , వ్యాపారం పేరుతో లూటీకి పాల్ప‌డుతూ వేల కోట్ల రూపాయ‌లు సంపాదించిన మై హోం సంస్థ‌ల చైర్మ‌న్ రామేశ్వ‌ర్ రావుకు కోలుకోలేని షాక్ త‌గిలింది. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో హ‌వా చెలాయించారు. ఆపై అడ్డ‌దిడ్డంగా భూముల‌ను ఆక్ర‌మించుకుంటూ పోయారు.

ముచ్చింత‌ల్ లో సైతం ఇలాగే చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో కేసీఆర్ ను అడ్డం పెట్టుకుని తెలంగాణ‌లో విలువైన భూముల‌ను ఆక్ర‌మించుకున్నాడ‌ని, ఆపై నిర్మాణాలు చేస్తూ కోట్లు వెన‌కేసుకున్నాడ‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి.

గ‌త ప‌దేళ్లుగా తాను చెప్పిందే వేదం అన్న రీతిలో సాగింది మై హోం చీఫ్ రామేశ్వ‌ర్ రావు వ్య‌వ‌హారం. ఆ మ‌ధ్య‌న ఆయ‌న‌పై మీడియా తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేసింది. దీంతో మీడియాను సైతం గుప్పిట్లోకి తీసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అందులో భాగంగానే ప‌లు టీవీల‌లో పెట్టుబ‌డులు క‌లిగి ఉన్నాడ‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

గులాబీ దండు పాళెం అండ‌దండ‌ల‌తో చెల‌రేగి పోయాడు రామేశ్వ‌ర్ రావు. అక్ర‌మంగా భూదాన్ భూములు 150 ఎక‌రాల‌ను ఆక్ర‌మించుకున్నాడు. ఆపై నిర్మాణాలు కూడా చేప‌ట్టాడు. దీనికి సంబంధించి కాంగ్రెస్ స‌ర్కార్ న‌జ‌ర్ పెట్టింది. ఈ మేర‌కు మై హోమ్ తో పాటు మ‌రో న‌లుగురికి నోటీసులు జారీ చేశారు రెవిన్యూ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ.

గ‌ద 10 ఏళ్లుగా ఇక్క‌డ నిర్మాణాలు చేప‌డుతూ వ‌చ్చారు. అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చి వేయాల‌ని ఆదేశించారు.