అప్పన్న గుడిని అభివృద్ది చేయండి
ఈవోకు సభ్యుడు గంట్ల శ్రీనుబాబు వినతి
సింహాచలం – ఏపీలో పేరు పొందిన సింహాచలంలో కొలువు తీరిన శ్రీ వరహాలక్ష్మి నరసింహ్మ స్వామి దేవాలయంలో అభివృద్ది పనులు చేపట్టాలని అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యుడు గంట్ల శ్రీను బాబు ఈవో ఎస్ శ్రీనివాస మూర్తిని కోరారు. ఈ మేరకు ఆయన వినతిపత్రం సమర్పించారు.
పలు అభివృద్ధి పనులకు సంబంధించి సుమారు గంట పాటు శ్రీను బాబు తోచర్చించారు. తాను చేసిన వినతి మేరకు ఈవో స్పందించారని సభ్యుడు తెలిపారు. బంగారమ్మ ఆలయ అభివృద్ధికి రూ.35 లక్షలు కేటాయించినందుకు ఈవోకు, సహచర ధర్మకర్తల మండల సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
వరాహ పుష్కరణి రెండో వైపు రూ.38 లక్షలతో నిర్మించనున్న మూడు పుష్కర ఘాట్ పనులు వేగవంతంగా ప్రారంభించాలని కోరానని తెలిపారు. దీనివల్ల దశదినకర్మలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఈఓ కి వివరించానని పేర్కొన్నారు.
సింహగిరిపై తిరుణామాలు. శ్రీనివాస్ నగర్ కల్యాణ మండపాల ప్రారంభోత్సవం, ప్రహ్లాద మండపం స్వాధీనం, ప్రసాద్ పథకం పనులతో పాటు అనేక అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరానని పేర్కొన్నారు.