NEWSTELANGANA

ప్ర‌జ‌ల కోసం ప్ర‌భుత్వం

Share it with your family & friends

ప్ర‌చారం అంతా అబ‌ద్దం

హైద‌రాబాద్ – ప్ర‌జ‌ల కోసమే త‌మ స‌ర్కార్ ప‌ని చేస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్. అపోహ‌లు ప‌డ‌వ‌ద్ద‌ని కోరారు. గ‌త ప్ర‌భుత్వంలో ఉన్న కార్పొరేష‌న్ల‌ను తాము మార్పు చేయ‌డం లేద‌న్నారు. కొత్త‌గా కేబినెట్ 16 కొత్త కార్పొరేష‌న్ల‌కు శ్రీ‌కారం చుట్టింద‌న్నారు.

ఇత‌ర కులాల‌ను , సామాజిక వ‌ర్గాల‌ను తాము ప‌క్క‌న పెట్టామ‌ని, నిర్ల‌క్ష్యం చేశామంటూ జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని తిప్పి కొట్టారు. ఇదంతా పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు గ‌తంలో ఉన్న కార్పొరేష‌న్ల వివ‌రాల‌ను వెల్ల‌డించారు మంత్రి ప్ర‌భాక‌ర్.

తెలంగాణ రాష్ట్ర బీసీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ , ఎంబీసీ డెవలప్మెంట్ కార్పోరేషన్ , రాష్ట్ర విశ్వ బ్రహ్మణ‌ కోఆపరేటివ్ సొసైటీ కార్పోరేషన్, గీతా కార్మికుల కో- ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ , మేదర ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర రజక కో ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్, నాయి బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్, రాష్ట్ర వ‌డ్డెర కార్పొరేష‌న్ , వాల్మీకి బోయ కార్పొరేషన్ , సగర ఉప్పర కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్, కృష్ణ బలిజ పూసల కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ , కుమ్మరి శాలివాహన కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్, బ‌ట్రాజుల కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు పొన్నం ప్ర‌భాక‌ర్.