పిఠాపురం నుంచి పవన్ పోటీ
ప్రకటించిన జనసేన పార్టీ చీఫ్
అమరావతి – ఏపీలో కీలకంగా మారిన రాజకీయ నాయకుడు, నటుడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేగా బరిలో ఉంటారా లేక ఎంపీగా పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని కూడా కన్ ఫర్మ్ చేశారు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు.
కానీ వీటన్నింటికి పుల్ స్టాప్ చేశారు పవన్ కళ్యాణ్. గురువారం ఈ మేరకు కీలక ప్రకటన చేశారు జనసేనాని. ట్విట్టర్ వేదికగా తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా తాను పిఠాపురం శాసన సభా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. దీంతో జనసేన పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో తెలుగుదేశం పార్టీ జనసేనతో పాటు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆక్టోపస్ లా విస్తరించిన జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపేందుకు కంకణం కట్టుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.