పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ పోటీ
పిఠాపురం వేదికగా ఎమ్మెల్యేగా
అమరావతి – ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. గురువారం ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్ చేశారు. ఆయన ఆసక్తికర విషయం పంచుకున్నారు. జనసేన పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను ఎంపీగా పోటీ చేయడం లేదని, ఏపీలోని పిఠాపురం శాసన సభ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున బరిలో ఉంటానని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
దీంతో తీవ్రంగా స్పందించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన గత కొంత కాలం నుంచీ నాగ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ , మెగా స్టార్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. వారిపై మాటల తూటాలు పేల్చుతున్నారు.
ఇదే సమయంలో ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి బరిలో ఉంటానని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పోటీలో ఉండాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. వర్మ ఇటీవలే వ్యూహం చిత్రం తీశాడు. ఇది పూర్తిగా వైసీపీకి సపోర్ట్ గా ఉందనే అభిప్రాయం ఉంది.