టెట్ కు సర్కార్ గ్రీన్ సిగ్నల్
డీఎస్సీ కంటే ముందే పరీక్ష
హైదరాబాద్ – ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ దిగి వచ్చింది. ఇప్పటికే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సర్కార్ నిరుద్యోగులను మోసం చేసింది. జాబ్స్ పేరుతో అవినీతి, అక్రమాలకు పాల్పడింది. పరీక్షలు చేపట్టాల్సిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్రమాలకు కేరాఫ్ గా మారింది.
తీవ్రమైన భూ కబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఏరికోరి రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించారు. ఈ సమయంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు.
నిరుద్యోగల ఆగ్రహాన్ని చల్లబర్చే ప్రయత్నం చేసింది సర్కార్. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీ కంటే ముందే నిర్వహించుకునేలా జీవో జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. దీని వల్ల 3 లక్షల మంది నిరుద్యోగులకు మేలు చేకూరనుందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.