సర్వేలు నిజం మాదే విజయం
టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్
అమరావతి – ఏపీలో త్వరలో జరగబోయే శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని పలు సర్వే సంస్థలు గంప గుత్తగా చెబుతున్నాయని ఇది అక్షరాల వాస్తవం కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
శుక్రవారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 175 అసెంబ్లీ స్థానాలకు తమ కూటమికి కనీసం 150 స్థానాలకు పైగా వస్తాయని పేర్కొన్నారు. ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి చూస్తే 25 స్థానాలకు గాను తమకు 20కి పైగా వస్తాయని స్పష్టం చేశారు.
సైకో జగన్ రెడ్డి రాక్షస పాలనకు చరమ గీతం పాడేందుకు జనం సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఏపీ సీఎం ఎన్ని వ్యూహాలు పన్నినా, ఇంకెన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా అంతిమంగా విజయం టీడీపీ కూటమిదేనని కుండ బద్దలు కొట్టారు నారా లోకేష్ బాబు.