ఆడ బిడ్డలకు ఆర్థిక స్వావలంబన
స్పష్టం చేసిన సీఎం రేవంత్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆడ బిడ్డలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రత్యేకించి మహిళా సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు రేవంత్ రెడ్డి.
లక్ష మంది మహిళల సాక్షిగా తాను మాట ఇచ్చానని, ఇచ్చిన మాటను తప్పే వ్యక్తిని కానని చెప్పారు. ఆడబిడ్డలు శ్రమకోర్చి తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు సీఎం.
ఇదిలా ఉండగా హైదరాబాద్ నడిబొడ్డున శిల్పారామంలో 100 స్టాల్స్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చానని తెలిపారు. అందుకే స్వయంగా బాధ్యత తీసుకుని ఇవ్వాళ శిల్పా రామంలో స్టాల్స్ సందర్శించినట్లు పేర్కొన్నారు.
.
అతి త్వరలో 119 స్టాల్స్ లలో ఆడబిడ్డలు తమ ఉత్పత్తులను అమ్మకానికి పెట్టుకునే సౌలభ్యం రాబోతోందని ప్రకటించారు రేవంత్ రెడ్డి. మహిళా స్వయం సహాయక సంఘాల అభ్యున్నతిలో ఇది తొలి అడుగు మాత్రమేనేని పేర్కొన్నారు.