కవిత ఇంట్లో ఐటీ సోదాలు
10 మంది అధికారుల బృందం
హైదరాబాద్ – ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. ఓ వైపు ఇదే కేసుకు సంబంధించి తనను అరెస్ట్ చేయొద్దంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం విచారణ జరిగే సమయంలో ఉన్నట్టుండి ఝలక్ ఇచ్చారు కవితకు.
కేంద్ర ఐటీ శాఖకు సంబంధించిన 10 అధికారులతో కూడిన బృందం ఊహించని రీతిలో హైదరాబాద్ కు విచ్చేశారు. కవితకు సంబంధించిన ఇళ్లల్లో ఐటీ సోదాలు జరుపుతోంది. విచిత్రం ఏమిటంటే ఈడీతో కలిసి ఐటీ టీం సోదాలు జరపడం విస్తు పోయేలా చేస్తోంది.
ఈ బృందం నాలుగు టీమ్ లుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. విస్తృతంగా సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కల్వకుంట్ల కవిత ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫెమా ఉల్లంఘన, ఇతర దేశాల నుంచి కవిత అకౌంట్ లోకి వచ్చిన డబ్బుల గురించి ప్రత్యేక బృందాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఫెమా ఉల్లంఘనకు కవిత పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.