NEWSNATIONAL

సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో ఎన్డీయే హవా

Share it with your family & friends

క‌నీసం 300కు పైగానే సీట్లు

న్యూఢిల్లీ – కేంద్ర ఎన్నిక‌ల సంఘం దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు సిద్దం అవుతోంది. ఈ త‌రుణంలో ప‌లు స‌ర్వే సంస్థ‌లు ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నే దానిపై పెద్ద ఎత్తున చ‌ర్చోప చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే గంప గుత్త‌గా అన్ని మీడియా, స‌ర్వే సంస్థ‌ల‌న్నీ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలోని ఎన్డీయే కూట‌మి తిరిగి అధికారంలోకి రానుంద‌ని పేర్కొంటున్నాయి. విచిత్రం ఏమిటంటే మోదీ మాత్రం త‌మ‌కు 400 సీట్ల కంటే ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇక రాష్ట్రాల వారీగా చూస్తే సీట్లు ఎన్ని వస్తాయ‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇక ఎన్డీయేకు ప‌శ్చిమ బెంగాల్ లో ప్ర‌స్తుతం టీఎంసీ ప‌వ‌ర్ లో ఉంది. ఊహించ‌ని రీతిలో బీజేపీకి గ‌ణ‌నీయ‌మైన స్థాయిలో సీట్లు పొంద‌నుంద‌ని తెలిపింద‌.ఇ బెంగాల్ 36, బీహార్ లో 36 సీట్లు కైవ‌సం చేసుకోనున్న‌ట్లు టాక్.

ఇక ఓడిశా రాష్ట్రంలో బీజేడీ మ‌ద్ద‌తు లేకుండానే ఎన్డీయేకు 15 సీట్లు, జార్ఖండ్ లో 12 , తెలంగాణ‌లో 6 సీట్లు , ఏపీలో 8 , గుజ‌రాత్ లో 26, మ‌హారాష్ట్రలో 28, క‌ర్ణాట‌క‌లో 22 , గోవాలో 2, మ‌ధ్య ప్ర‌దేశ్ లో 29 సీట్లు వ‌స్తాయ‌ని పేర్కొంటున్నాయి.

మ‌రో వైపు ఛ‌త్తీస్ గ‌ఢ్ లో 11 సీట్లు, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో 4, ఉత్త‌రాఖండ్ లో 5, రాజ‌స్థాన్ లో 25, హ‌ర్యానాలో 9 , ఉత్త‌ర ప్ర‌దేశ్ లో 75, పంజాబ్ లో 2 , న్యూఢిల్లీలో 7 సీట్ల చొప్పున భార‌త కూట‌మి సీట్ల‌ను కైవ‌సం చేసుకోనంద‌ని అంచ‌నా వేశాయి.