దీక్ష విరమించిన అశోక్
పరామర్శించిన ఎమ్మెల్సీ
హైదరాబాద్ – ప్రభుత్వానికి వ్యతిరకంగా నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ విద్యా వేత్త , ఉద్యమకారుడు అశోక్ శుక్రవారం దీక్ష విరమించారు. ఆయన దీక్ష చేపట్టిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పరామర్శించారు. తాను నిరుద్యోగుల పక్షాన ఉంటానని స్పష్టం చేశారు. మీరు కోరుతున్న న్యాయ పరమైన డిమాండ్ల సాధనకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈమేరకు నిరుద్యోగుల పక్షాన నిరాహార దీక్ష చేపట్టారు అశోక్. ఆయన గత కొంత కాలం నుంచీ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తూ వచ్చారు. తక్కువకు ఫీజు తీసుకుంటూ పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందజేస్తున్నారు.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏకంగా పలు ఉద్యమాలు చేశారు. ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. చివరకు కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్క కసోం ప్రచారం చేపట్టారు. తాజాగా పోస్టులు పెంచాలని, టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు. చివరకు బల్మూరి వెంకట్ హామీ ఇవ్వడంతో దీక్ష విరమించారు అశోక్.