సీఎం రేవంత్ కు ఆహ్వానం
ఆశీర్వదించిన అర్చకులు
హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని శుక్రవారం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో అర్చకుల బృందం కలుసుకుంది. సీఎం నివాసంలో ఆలయం తరపున రావాలని ఆహ్వానించారు. ఈ సందర్బంగా శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి వారికి చెందిన ప్రసాదం , చిత్రపటం అందజేశారు.
ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డిని అర్చకులు ఆశీర్వదించారు. ఆయన సుఖ సంతోషాలతో , ఆయురారోగ్యాలతో ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా ధర్మపురి నరసింహ్మ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెలలోనే కొనసాగున్నాయి.
ఇందులో భాగంగా మార్చి 20 నుంచి ఏప్రిల్ 1 వరకు భారీ ఎత్తున ఉత్సవాలు జరగనున్నాయి. ప్రత్యేకంగా ఆహ్వానం అందజేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డికి. ఈ సందర్బంగా తనను ఆశీర్వదించిన అర్చకులు, పూజారులకు ధన్యవాదాలు తెలిపారు సీఎం. తాను తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు.