NEWSANDHRA PRADESH

ఎన్నిక‌ల్లో వైసీపీ జెండా ఎగ‌రాలి

Share it with your family & friends

పిలుపునిచ్చిన విజ‌య సాయి రెడ్డి

నెల్లూరు జిల్లా – రాష్ట్రంలో జ‌రిగే శాస‌న స‌భ‌, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో వైసీపీ జెండా ఎగుర వేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు ఎంపీ విజ‌య సాయి రెడ్డి . శుక్ర‌వారం నెల్లూరు పార్ల‌మెంట్ ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిశీల‌కులు, స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లకు దిశా నిర్దేశం చేశారు. ఈ మేర‌కు ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చారు ఎంపీ.

సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఎంపీ స్థానమే కాకుండా ప్రతీ అసెంబ్లీ స్థానం గెలిచే విధంగా కష్టపడి పని చేయాల‌ని కోరారు విజ‌య సాయి రెడ్డి. ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ నాయకులతో సమన్వయం చేసుకోవాల్సిన ప్రధాన బాధ్యత నియోజకవర్గ పరిశీలకులు, కోఆర్డినేటర్లపైనే ఉంటుందని స్ప‌ష్టం చేశారు .

మీకు ఏదైనా సమస్య వస్తే త‌న‌ దృష్టికి తీసుకు రావాల‌ని కోరారు విజ‌య సాయి రెడ్డి. పోలింగ్‌కు బూత్ కమిటీలు చాలా కీలకం కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న బూత్ కమిటీల నియామకం వేగంగా పూర్తి కావాల‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను గౌరవించాల‌ని సూచించారు.