కాంగ్రెస్ సర్కార్ వేధిస్తోంది
వాపోయిన తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన బీఆర్ఎస్ లో నెంబర్ టు గా ఉన్నారు. అన్నీ తానై వ్యవహరించారు. కాంగ్రెస్ జోరును తట్టుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదే సమయంలో పదే పదే కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేస్తున్నారు. తన మాటల చాతుర్యంతో బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీని పూర్తిగా తన కంట్రోల్ లో పెట్టుకున్న తన్నీరు హరీశ్ రావు ఈ మధ్య తన మాటల తూటాలను పేల్చుతున్నారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజా పాలనను గాలికి వదిలేశారంటూ ధ్వజమెత్తారు. కేవలం రాష్ట్రంలో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు తన్నీరు హరీశ్ రావు.
అయినా తాము బెదిరే ప్రసక్తి లేదంటూ హెచ్చరించారు మాజీ మంత్రి. ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిన ప్రభుత్వం వాటిని కప్పి పుచ్చుకునేందుకు తమపై దాడులకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు తన్నీరు హరీశ్ రావు.