NEWSTELANGANA

తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

Share it with your family & friends

ముగ్గురితో క‌మిటీ ఏర్పాటు

హైద‌రాబాద్ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా తాము ఇచ్చిన హామీ మేర‌కు ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు సీఎం.

రాష్ట్రంలో ఇప్ప‌టి దాకా ఉన్న ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప‌ద్ద‌తిన ప‌ని చేస్తున్న సిబ్బందికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు గాను ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఎనుముల రేవంత్ రెడ్డి. సీఎం ఆదేశాల మేర‌కు రాష్ట్ర ప్ర‌ణాళిక సంఘం వైస్ చైర్మ‌న్ డాక్ట‌ర్ జిల్లెల చిన్నారెడ్డి, తెలంగాణ జ‌న స‌మితి పార్టీ చీఫ్ కోదండ రాం రెడ్డి, ఐఏఎస్ ఆఫీస‌ర్ దివ్య‌ను నియ‌మించిన‌ట్లు వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా మార్చి 10న రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల‌తో సీఎం ఎంసీహెచ్ఆర్డీలో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. సంఘాల ప్ర‌తినిధులు విన‌తులు ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు.

వీటిని పరిశీలించి సాధ్యాసాధ్యాలు, పరిష్కార మార్గాలను సూచించే బాధ్యతను త్రిసభ్య కమిటీకి అప్పగించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.