సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటుతాం
బీజేపీ రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ
హైదరాబాద్ – త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి సత్తా చాటడం ఖాయమని జోష్యం చెప్పారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. విజయ్ సంకల్ప్ యాత్ర సందర్బంగా హైదరాబాద్ లోని మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో రోడ్ షో చేపట్టారు. భారీ ఎత్తున జనం పోగయ్యారు. అపూర్వమైన ఆదరణ లభించడంతో ప్రధాన మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. అన్ని రంగాలలో భారత దేశం ముందంజలో కొనసాగుతోందని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు తారా స్థాయికి చేరుకున్నాయని ఆరోపించారు. వాటిని నిర్మూలించేందుకే తాను ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తూ వచ్చానని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ.
దేశంలోని 143 కోట్ల మంది భారతీయులు సుస్థిరమైన పాలనను కోరుకుంటున్నారని, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఆశిస్తున్నారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి రానున్నాయని ధీమా వ్యక్తం చేశారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.